రక్తదానం.. ప్రాణదానం!

01-10-2026 | 06:00pm

ముకరంపుర, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 9 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం(Blood Donation Camp) నిర్వహించారు. ఈ శిబిరంలో 40 మంది ఎన్‌సీసీ(NCC) క్యాడెట్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని డాక్టర్ ఉషా తెలిపారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ వీ. కృష్ణ మాట్లాడుతూ.. “ప్రతి రక్తపు బొట్టులో మానవత్వం నిండి ఉంది” అని పేర్కొన్నారు. రక్తదానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దాని ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో పలువురు క్యాడెట్లు రక్తదానం చేసి ‘రక్తదానం–ప్రాణదానం’ అనే సందేశాన్ని సమాజానికి అందించారు. రక్తదానం చేసిన క్యాడెట్లను డాక్టర్ హరిజోత్ కౌర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు కెప్టెన్ రేల్ల సంజీవ్, కెప్టెన్ కిరణ్ జ్యోతి, విజయ్ కుమార్, శివకుమార్, గులాబ్, విపిన్ సింగ్, ఆర్మీ అధికారులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు