చీపురు పట్టిన సర్పంచ్
01-10-2026 | 06:07pm
బెజ్జంకి, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో స్వచ్ఛతా హే సేవా(Swachhata Hi Seva) కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ బిగుల్లా మోహన్ స్వయంగా చీపురు పట్టి శ్రమదానం చేశారు. పంచాయతీ కార్యాలయ పరిసరాలతో పాటు ప్రధాన రహదారిని శుభ్రం చేశారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ తెలిపారు. పరిశుభ్రతకు(Public Cleanliness) ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినీత్ గౌడ్, కార్యదర్శి ఆకుల రాకేష్, వార్డు సభ్యులు, పారిశుధ్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.