సౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణ

01-10-2026 | 06:03pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 1(విజయ క్రాంతి): సౌర విద్యుత్ వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha ) అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజిలి యోజనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న.

ఈ పథకం ద్వారా ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్ పొందవచ్చన్నారు. ప్రజలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు