గణపురంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
గణపురం, అక్టోబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గణపురం మండలంలో(Ganapuram Mandal) శనివారం ప్రారంభమైంది. తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మను(Bathukamma) పురస్కరించుకుని గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో(Sri Pattabhi Sitaramachandra Swamy Temple) వేడుకల్లో గణపురం సర్పంచ్ కట్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. తొలిరోజు పెద్ద బతుకమ్మ లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆటలు ఆడారు. పాటలు పాడుతూ, కోలాటాలతో సందడి చేశారు.
మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.