పూల సింగిడిలా.... సంస్కృతి వైభవం

10-10-2026 | 10:52pm

జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు!

తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగకు శ్రీకారం

ఆసిఫాబాద్‌(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) ఆసిఫాబాద్‌ జిల్లా(Asifabad District) వ్యాప్తంగా శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో(Devotional) నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు, మహిళల కోలాటాలు, పూల పరిమళాలతో గ్రామాలు, పట్టణాల్లో పండుగ శోభ సంతరించుకుంది.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, పూల పండుగ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు జిల్లాలో పల్లెపల్లెలా ఉత్సాహంగా సాగాయి. మహిళలు వలయాకారంగా చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. తొలిరోజు వేడుకలతో జిల్లాలో పండుగ సందడి నెలకొనగా, రానున్న రోజుల్లో బతుకమ్మ సంబరాలు మరింత వైభవంగా కొనసాగనున్నాయి.

మరిన్ని వార్తలు