త్రాగునీటి సమస్యకు ప్రత్యేక కృషి

17-10-2026 | 11:56pm

సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 

గణపురం,అక్టోబర్ 19 (విజయక్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలో త్రాగునీటి సమస్య(Drinking water problem) పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Katkuri Radhika Srinivas) అన్నారు. శనివారం మండల కేంద్రంలో బోరు మోటర్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన వర్షాలు లేకపోవడం వల్ల నీటి సమస్య ఏర్పడుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) సహకారంతో మండల కేంద్రంలో ఇప్పటికే పలు కాలనీలో బోరు మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల కిరణ్ , వార్డు సభ్యులు గంధం ఓదాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు