మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన

02-11-2026 | 05:13pm

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి

గణపురం,(విజయ క్రాంతి): ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గణపురం మోడల్ స్కూల్(Ganapuram Model School) ఉపాధ్యాయులు సోమవారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రెండో దశ నిరసనలో భాగంగా మండల తహసీల్దార్ అల్లూరి రాజేశ్వరరావు , ఎంపీడీవో శ్రీకాంత్ లకు వినతిపత్రాలు అందజేశారు.

010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, ఇంటర్ బోధించే ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్ వేతన స్కేలు వర్తింపజేయాలని, 317 జీవో అమలు చేయాలని, ఆరోగ్య కార్డులు అందించాలని, తాత్కాలిక ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని, హెచ్‌బీటీలకు రూ.35 వేల వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు మోడల్ స్కూళ్లను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. ఈ నెల 4, 5 తేదీల్లో జిల్లా స్థాయిలో వినతిపత్రాలు అందజేయడంతో పాటు నవంబర్ 17న రాష్ట్రస్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు