మహా పాదయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ
ఖానాపూర్ ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించి బిజెపి మహాపాదయాత్ర పోస్టర్లను(Maha Padayatra posters) విడుదల చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పోస్టర్లను ఆవిష్కరించారు. మహా పాదయాత్రకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు తల్లి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బన్సీలాల్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, రాష్ట్ర అగ్రనేతలు హాజరుకానునట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్యం చంద్రకాంత్, చిన్నారెడ్డి, సాదం అరవింద్, రామ్నాథ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు