వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి,(విజయక్రాంతి): వయోవృద్ధుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ(Senior Citizen Welfare and Rights)కు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. గురువారం ఐడీఓసీలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం(International Day of Older Persons)లో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వయోవృద్ధులను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అర్హులైన వారికి సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు అందిస్తామన్నారుభూపాలపల్లిలో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని, శాశ్వత కేంద్రం నిర్మాణంలో ఉందని పేర్కొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తల్లిదండ్రుల పోషణ బాధ్యత విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.