దుర్గామాత మండపంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

16-10-2026 | 03:10pm

ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి

మహాముత్తారం, అక్టోబర్ 16 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని టీజీబీ బ్యాంకు కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(TPCC General Secretary Duddilla Srinubabu) శుక్రవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని దుర్గామాతను ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను, అమ్మవారి భక్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు