నందిగామలో గౌడ హాస్టల్ ప్రారంభోత్సవం

16-10-2026 | 04:19pm

ముఖ్యతిథులుగా పొన్నం ప్రభాకర్, టిపిసిసి అధ్యక్షుడులు మహేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ 

పటాన్ చెరు, అక్టోబర్ 16: సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌడ్ హాస్టల్‌ను శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister for BC Welfare Ponnam Prabhakar),(TPCC) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే గౌడ కుల విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం నాణ్యమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నూతన హాస్టల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ గౌడ్, నందిగామ గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు