పాడి రైతుల సంక్షేమమే మదర్ డైరీ లక్ష్యం
కొల్లూరు పాల సంఘం చైర్మన్ ఐలి కృష్ణ గౌడ్..
ఆలేరు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): పాడి రైతుల సంక్షేమం(Welfare of Dairy Farmers), ఆర్థిక అభివృద్ధే మదర్ డైరీ(Mother Dairy) ప్రధాన లక్ష్యమని కొల్లూరు పాల సంఘం చైర్మన్ ఐలి కృష్ణ గౌడ్(Aili Krishna Goud) అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆలేరు మండలం(Aler Mandal), కొల్లూరు గ్రామంలో పాల ఉత్పత్తిదారులకు(Milk producers') బోనస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై పశువుల దాణా అందించడంతో పాటు పాల ధరలను పెంచినట్లు తెలిపారు.
ఎన్డీడీబీ సహకారంతో భవిష్యత్తులో రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనగామ సుధాశ్రీ పాల్ రెడ్డి, మేనేజర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాజుల దశరథ, మాజీ వైస్ ఎంపీపీ కోరుకొప్పుల కిష్టయ్య, మాజీ చైర్మన్ పిల్లమరి శంకరయ్య, సంఘం డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు