25 న మహా ధర్నాను జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు
సుల్తానాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): మల్టీ ఫుల్ డేస్ మహాధర్నా వాల్ పోస్టర్స్ ను శుక్రవారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ లో ఆవిష్కరించారు, ఇందులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు(CITU District Secretary Eravelli Muthyam Rao) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25, 26 రెండు రోజులు హైదరాబాద్ ఇందిరాపార్క్(Indira Park, Hyderabad) వద్ద రాష్ట్రంలోని వివిధ రంగాల కార్మికుల, ఉద్యోగుల సమస్యలు(Problems of workers and employees) పరిష్కరించాలని, సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు.
కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు 42 వేల రూపాయలుగా నిర్ణయించాలని, కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, 2వ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని, అప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డీఏలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు వర్తింపచేయాలని అన్నారు.
గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు, అక్టోబర్ 25న ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు పారిశ్రామిక కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, అక్టోబర్ 26న రాష్ట్రవ్యాప్త యూనియన్లు, స్కీం వర్కర్స్, స్థానిక సంస్థల కార్మికులు, అసంఘటితరంగా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, సుల్తానాబాద్ మండల నాయకులు మాతంగి రాజమల్లు, రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి. లారీ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జంగ తిరుపతిరెడ్డి, రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం గౌరవ సలహాదారులు బండారి స్వామి, రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం ఉపాధ్యక్షులు శేర్ రవీందర్ , వీరగోని కిరణ్. లారీ డ్రైవర్ యూనియన్ కార్యవర్గ సభ్యులు మాతంగి శంకర్, హరిదాస్ పలువురు పాల్గొన్నారు...