ఆసరా పింఛన్ లబ్ధిదారుల వివరాల పరిశీలన
ప్రత్యేక అధికారి డీఎల్పీవో సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో వెరిఫికేషన్
నాగల్గిద్ద, అక్టోబర్ 16 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండల పరిధిలో ఆసరా పింఛన్(Aasara Pension) లబ్ధిదారుల వివరాల పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో(Mandal Praja Parishad Office) నిర్వహించారు. ఆసరా పింఛన్ల వెరిఫికేషన్ ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. మండల అధికారులు ఇప్పటికే పరిశీలించిన పింఛన్ లబ్ధిదారుల్లో 10 శాతం మందిని ఎంపిక చేసి, ఎంపీడీవో మహేశ్వరరావు వారిని మండల పరిషత్ కార్యాలయానికి పిలిపించారు.
ప్రత్యేక అధికారి సమక్షంలో లబ్ధిదారుల వివరాలను మరోసారి పరిశీలించి, సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించారు. వెరిఫికేషన్ ప్రక్రియలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సహకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర మండల అధికారులు, ఆసరా పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.