గణపురంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

18-10-2026 | 07:33pm

గణపురం, అక్టోబర్ 18 (విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు(Saddula Bathukamma celebrations) ఆదివారం ఘనంగా  జరిగాయి. సర్పంచ్‌ కట్కూరి రాధిక శ్రీనివాస్‌ పర్యవేక్షణలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి బతుకమ్మలను చుట్టూ పెట్టుకుని సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు.

మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించారు. పండుగ ప్రాంగణాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.  బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణపురం ఎస్ఐ బొరగల అశోక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు