దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం

18-10-2026 | 08:15pm

కొండపాక, అక్టోబరు 18:(  విజయక్రాంతి):- కొండపాక మండలం (Kondapaka Mandal)మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు(Sharannavaratri Celebrations) వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు దుర్గ దేవి స్వరూపిణిగా విజయదుర్గ భక్తులకు దర్శనమిచ్చింది. క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ(Cheppela Harinatha Sarma) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.దుర్గాష్టమి వేడుకలు పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొని పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు