జగన్మాత దుర్గాదేవి... ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

18-10-2026 | 08:12pm

అరుంధతి నగర్ లో ఘనంగా అన్నదాన కార్యక్రమం.                           

మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్.                          

జవహర్ నగర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్టు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్(Etela Rajender) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ అరుంధతి నగర్ లో ఉన్న సాయిబాబా దేవాలయం(Sai Baba Temple) వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ హాజరై సాయిబాబా స్వామి వారికి దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు స్వయంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భక్తి భావం సామాజిక ఐక్యత సమగ్రత పెంపొందించవచ్చునన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, చంద్రపురి కాలనీ 2 డివిజన్ బిజెపి అధ్యక్షులు కర్లపూడి జోగారావు, కమలాకర్, మహేందర్ యాదవ్, సన్నీ, రఘురాం చారి, మల్లికార్జున గౌడ్, మహేష్ గౌడ్, శ్రీ శివ కేశవ, వెంకటేష్, రాజు, మహేష్, విజయ్, సిహెచ్. రాజు, విగ్నేష్, రాము, బిజెపి కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు