శ్రీరాములపల్లెలో సద్దుల సంబరం

18-10-2026 | 08:10pm

కొత్తపల్లి ,అక్టోబర్ 18( విజయక్రాంతి ) : కరీంనగర్ జిల్లా(Karimnagar District) కొత్తపల్లి మండలంలోని శ్రీరాములపల్లె (ఎలగందల్) గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ(Bathukamma Festival) వేడుకలను కోలాహలంగా నిర్వహించుకున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం(Gram Panchayat Governing Body) తగిన ఏర్పాట్లు చేయగా, మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుకొని వచ్చి, సంప్రదాయ బద్దంగా ఆడపడుచులు బతుకమ్మ పాటలతో ఆడుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ నిమ్మల అంజయ్య, వార్డు మెంబర్ శ్రీరామ్ వైశాలిని-సురేందర్, గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు