తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ నిదర్శనం

18-10-2026 | 08:33pm

లయన్స్ క్లబ్ అధ్యక్షులు తల్లాడ కేదారి.

తుంగతుర్తి (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) వేడుకల్లో భాగంగా తుంగతుర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందంగా తీర్చి దిద్దిన మహిళా బతుకమ్మలకు బహుమతుల ప్రధానం ఆదివారం బతుకమ్మ ఘాట్ వద్ద మొదటి బహుమతి అంబటి రేణుక, ద్వితీయ బహుమతి గోపగాని వనజ, తృతీయ బహుమతి పెండెం సువర్ణతో పాటు కన్సల్టెంట్ బహుమతి అందజేశారు. సాయంత్రం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు తల్లాడ కేదారి మాట్లాడుతూ మహిళలు తయారుచేసిన బతుకమ్మలను గుర్తించి బహుమతి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఆయన అన్నారు. దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగకు మంచి గుర్తింపు రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు పులుసు వెంకటనారాయణ, ఎనగందుల శ్రీనివాస్, కోశాధికారి ఓరుగంటి శ్రీనివాస్, కోఆర్డినేటర్లు ఎనగందుల గిరి, ఓరుగంటి సుభాష్, వెంకటేశ్వర్లు, గుండ గాని రాములు గౌడ్, రమేష్, గుజ  భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు