భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

18-10-2026 | 08:29pm

బోధన్ అక్టోబర్ 18 (విజయ క్రాంతి): నవీపేట్ మండలం(Navipet Mandal) సుభాష్నగర్కు చెందిన పర్వీన్(Parveen)(33)పై భర్త అన్వర్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్(SI Srikanth) తెలిపారు. శనివారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఆమెను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె సోదరుడు అఫ్రోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు