భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ సంబరాలు
సంప్రదాయ దుస్తుల్లో సందడి చేసిన ఆడపడుచులు..
ఆటపాటలతో మార్మోగిన బతుకమ్మ వేడుకలు
మేడిపల్లి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్(Boduppal Circle) పరిధిలోని మేడిపల్లి(Medipalli) లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను(Saddula Bathukamma festivities) ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో(devotional), ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా అమ్మవారిని భక్తితో కొలుస్తూ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరుపుకున్నారు.