పట్టు పురుగుల పెంపకం రైతులకు పనిముట్లు పంపిణీ.

26-10-2026 | 08:01pm

మహదేవ్‌పూర్/కాళేశ్వరం,(విజయక్రాంతి): పట్టు పురుగుల పెంపకం రైతులకు హన్మకొండ సి ఎస్ బి, ఆర్ ఎస్ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో పనిముట్లను పంపిణిచేశారు.సోమవారంమహదేవ్‌పూర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద అటవీ ప్రాంతంలో పట్టు పురుగుల ప్లాంటేషన్ లను  క్షేత్ర స్థాయి లో సెలికల్చర్ అధికారులు పరిశీలించారు. అయ్యప్ప స్వామి దేవాలయం అటవీ ప్రాంత అడ్డాలో 20 మంది  పట్టు పురుగుల పెంపకం రైతులకు అవగాహన కల్పించారు.

ఈ పర్యటన సందర్భంగా సైంటిస్ట్-సి,డా. కె రజిత రైతులకు క్రిమిరహితం చేసే పద్ధతులు,టస్సర్ పట్టు పురుగుల పెంపకం, తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణ, అలాగే జీవన్ సుధ, మరియు డ్యూపరెటెక్స్ వాడకం గురించి వివరించారు. రైతులకు బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నం పొడి. కొమ్మల కట్టింగ్ పరికరాలను రైతులకు అందజేశారు .ఈ కార్యక్రమంలో జెడిఎస్ హనుమకొండ జి. అనసూర్య, ఏడిఎస్ భూపాలపల్లి సిహెచ్. తిరుపతి రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు కర్క రవికుమార్.మరియు సారయ్య, సెరికల్చర్ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు