గ్రామదేవతలకు పూజలు
10-09-2026 | 01:51pm
గణపురం,సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణమాసం గురువారం చతుర్దశి పర్వదినం సందర్భంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతినెల నిర్వహించే పూజా కార్యక్రమంలో భాగంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.అనంతరం పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు నిర్వహించారు.