మనో వ్యాధులకు మందులు ఉన్నాయి
కొత్తపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా గణనీయ సంఖ్యలో మానవాళి మానసిక రుగ్మతల(Humanity's mental disorders) బారినపడి అనారోగ్యాల పాలు అవుతున్నారని, నేడు మానసిక వ్యాధులకు(mental illnesses) సహితం వైద్యం అందుబాటులోకి వచ్చిందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ వర్షి(Renowned psychiatrist Dr. L. Varshi) అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం(World Mental Health Day) సందర్భంగా సుమ ఆసుపత్రి ప్రాంగణంలో(Suma Hospital premises) శాతవాహన లయన్స్ క్లబ్(Satavahana Lions Club) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మానసిక ఒత్తిడి(Mental stress), ఆందోళన, భయం, ఒంటరితనం, మాదక ద్రవ్యాల వినియోగం(Drug abuse), పని ఒత్తిడి, నిద్రలేమి లాంటి పలు కారణాల మూలంగా మానసిక అనారోగ్యం(Mental illness) కలుగుతుందని, త్వరగా గుర్తిస్తే పూర్తి చికిత్స చేయవచ్చని తెలిపారు.
ఒక నాడు మనో వ్యాధికి మందు లేదు అనే స్థాయి నుంచి నేడు సరైన సమయంలో సరైన వైద్యులను సంప్రదిస్తే పూర్తి చికిత్స జరుగుతుందని తెలిపారు. మానసిక రుగ్మతను రెండు వారాల్లో గుర్తిస్తే మంచి చికిత్స అందించవచ్చని తెలిపారు. మానసిక వైద్యులను సంప్రదించడానికి పౌర సమాజం వెనుకంజ వేయవద్దని, నేటి వేగవంతమైన జీవనశైలిలో మానసిక రుగ్మతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిపారు. మానసిక రుగ్మతలకు కౌన్సిలింగ్, ఔషధ చికిత్స కూడా అవసరం కావచ్చని తెలిపారు.
తర్వాత ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సమస్యగా అవతరిస్తున్న మానసిక సమస్యలు 45 కోట్ల ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. 14 ఏండ్ల వయస్సు నుంచి 100 ఏండ్ల వృద్ధుల వరకు అందరూ మానసిక రుగ్మతల బారినపడుతున్నారని విచారం వ్యక్తంచేశారు. మానసిక సమస్యల పట్ల కనీస అవగాహన కలిగి ఇరుగుపొరుగు పౌర సమాజానికి తగిన సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వర్షిని శాతవాహన లయన్స్ క్లబ్ సభ్యులు సముచితంగా సన్మానించారు.
ఇదే కార్యక్రమంలో నగర ప్రముఖ ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్ చక్రవర్తుల రమణా చారి జన్మదినం సందర్భంగా కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు లయన్ ఎం మహేందర్, లయన్ ఎన్ వేణుగోపాల్, లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, లయన్ ఈ రమేష్, లయన్ కె రాజెందర్ రెడ్డి, లయన్ వి జగదీశ్వరాచారి, లయన్ డా ఎస్ మనోహరాచారి, లయన్ డి తిరుపతి రెడ్డి, లయన్ కె సత్యం, లయన్ పి సురేందర్, ఆసుపత్రి సిబ్బంది, నగర పౌరులు పాల్గొన్నారు.