సిరికొండలో దసరా ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు

10-10-2026 | 06:27pm

సిరికొండ , అక్టోబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా(Nizamabad District) సిరికొండ మండల కేంద్రంలోని పీయం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల(Sri Telangana Model School), జూనియర్ కళాశాలలో వృత్తి విద్యా విభాగాల(Vocational education departments) ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పది రోజుల దసరా ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు(Dasara Internship Programs) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా అగ్రికల్చర్ అండ్ మీడియా , ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల విద్యార్థులు ఆయా రంగాలకు సంబంధించిన ప్రాయోగిక పరిజ్ఞానాన్ని, క్షేత్రస్థాయి అనుభవాన్ని పొందుతున్నారుని అన్నారు.

అగ్రికల్చర్ విభాగం విద్యార్థులు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి, ఎరువుల వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులు, రైతులకు అందించే సేవలు, వ్యవసాయ రంగంలో ఉపాధి , స్వయం ఉపాధి అవకాశాలు,మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం విద్యార్థులు స్థానిక ఫ్రెండ్స్ ఫోటో స్టూడియోను సందర్శించి, ఫోటోగ్రఫీ, ఫోటోషూట్, కెమెరా వినియోగం, లైటింగ్ పద్ధతులు, ఫోటో ఎడిటింగ్, డిజిటల్ మీడియా సాంకేతికతలు, స్టూడియో నిర్వహణ తదితర అంశాలపై ప్రాయోగిక పరిజ్ఞానాన్ని పొందుతున్నారని అన్నారు .

 కార్యక్రమాల్లో వృత్తి విద్య – అగ్రికల్చర్ అధ్యాపకుడు జాడి సాయి వినయ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు