యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్

16-10-2026 | 02:32pm

మహాదేవపూర్,కాళేశ్వరం,అక్టోబర్ 16(విజయాక్రాంతి ): ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ క్వాలిటీ(International Association for Quality) అస్యూరెన్స్ ఇన్ ప్రీ-టెర్షియరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (క్యూ.ఏ.హెచ్.ఈ) ద్వారా గుర్తింపు పొందిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ(United American University) నుండి మహాదేవపూర్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు డాక్టరెట్ ప్రధానం చేసింది. మహాదేవపూర్ లోని బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా పని చేయుచున్న బి ప్రభాకర్ రెడ్డికి వినూత్న విద్యాబోధన.

పర్యావరణ పరిరక్షణ అనే అంశానికి, బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా పని చేయుచున్న మడక మధుకు ఐబ్రో కోడింగ్ లాంటి నూతన ఆవిష్కరణలు అనే అంశానికి గాను గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.విద్యార్థుల అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ వీరు చేస్తున్న నిరంతర కృషిని, గుర్తించిన యూనివర్సిటీ వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

ఈ అవార్డుల ప్రధానోత్సవం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై లోని శ్రీకృష్ణ గానసభలో యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్, డా.శ్రీ కే.వెంకటేషన్ మరియు తమిళనాడు రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా అందుకున్నారు .వీరిని ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,శ్రీ అనిల్ కుమార్,శ్రీనివాస్ రెడ్డి,మహాదేవపూర్ మండల విద్యాధికారి పురుషోత్తం రెడ్డి,ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

మరిన్ని వార్తలు