వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
13-09-2026 | 04:25pm
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, (విజయ క్రాంతి): సెప్టెంబర్ 13: వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని కోరారు. మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ మత సామరస్యాన్ని కాపాడాలని తెలిపారు. నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.