ప్రతి కుటుంబం పొదుపును అలవాటుగా మార్చుకోవాలి

17-10-2026 | 03:47pm

నేటి పొదుపే రేపటి ఆర్థిక భరోసా: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల: ప్రతి కుటుంబం పొదుపు అలవాటును పెంపొందించుకొని ఆర్థికంగా స్థిరపడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Collector Rizwan Basha Sheikh) సూచించారు. ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు ఆర్థిక భరోసా పొందవచ్చని తెలిపారు.శనివారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు(Telangana Grameena Bank) ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల కరపత్రాన్ని కలెక్టర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంకులు అందించే డిపాజిట్ పథకాలపై అవగాహన పెంచుకొని, తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సరైన పథకాన్ని ఎంచుకోవాలని సూచించారు. డిపాజిట్ చేసే ముందు తాజా వడ్డీ రేట్లు, నిబంధనలను బ్యాంకు అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.

తెలంగాణ గ్రామీణ బ్యాంకు 1,000 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ ఖాతాదారులకు 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం వార్షిక వడ్డీ అందిస్తుండగా, 444 రోజుల డిపాజిట్‌పై వరుసగా 7.40 శాతం, 7.90 శాతం వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం బ్యాంకింగ్ సేవలు, పొదుపు పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ వైభవ్, అసిస్టెంట్ మేనేజర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు