సింగపూర్ విద్యా వ్యవస్థపై అధ్యయనం చేసిన తెలంగాణ ఉపాధ్యాయ బృందం

22-09-2026 | 07:42pm

కామారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సింగపూర్లో చేపడుతున్న విద్యాబోధనపై తెలంగాణ ఉపాధ్యాయ బృందం(Telangana Teachers Group) అధ్యయనం కోసం వెళ్ళినట్లు కామారెడ్డి మండలం అడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత తెలిపారు. ప్రతి ప్రదేశంలో పచ్చదనం, విద్యార్థి కేంద్రీక బోధన చేపట్టినట్లు తెలిపారు. బాలల ప్రారంభ ప్రాథమిక విద్య పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడు నుంచి 12 ఏళ్ల వరకు నిర్బంధ విద్య కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి చిన్నారికి ప్రాథమిక విద్య అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. 1935 నుంచి సింగపూర్ లో ని విద్యా విధానంలో జరిగిన మార్పులను రిటైర్డ్ ఉపాధ్యాయురాలు వివరించినట్లు తెలిపారు. ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు సాంకేతిక విద్య, పోషకాహారం, ఆహార విజ్ఞానం వంటి అంశాలను విద్యార్థులకు బోధిస్తారన్నారు. ప్రతి చిన్నారికి ప్రాథమిక విద్య అందేలా చర్యలు తీసుకుంటారని అన్నారు.

పాఠశాలలు విద్యార్థుల నివాస ప్రాంతానికి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల లోపు ఉంటాయన్నారు. 12 సంవత్సరాల వయసులో ప్రాథమిక పాఠశాల విడిచి వెళ్లే పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో ఇంగ్లీష్, గణితము, విజ్ఞాన శాస్త్రము, మాతృభాష, అంశాలు ఉంటాయని తెలిపారు. చిన్న సమాధానం, దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయన్నారు. ఒక చిన్నారికి 500 నుంచి 1000 డాలర్లు ఖర్చు చేస్తారన్నారు. ఫలితాలను బహిరంగంగా ప్రకటించాలని తెలిపారు. వ్యక్తిగతంగా తల్లిదండ్రులకు పిలిచి ఫలితాలను వివరిస్తారని అన్నారు. తల్లిదండ్రులే పిల్లలను తీసుకెళ్తారని తెలిపారు. సాంకేతిక వినియోగం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు