సమాచార హక్కు కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బొడ్డు నరేష్
దోమకొండ, అక్టోబర్ 18 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం సాధన కమిటీ(Right to Information Act Implementation Committee) కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దోమకొండ కు చెందిన సామాజిక కార్యకర్త బొడ్డు నరేష్ కుమార్(Boddu Naresh Kumar) నియమితులయ్యారు. జాతీయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్(Chanti Mudiraj) నియామక పత్రాన్ని అందజేశారు .ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు చట్టం(Right to Information Act) కీలకమైనదని, ఈ చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నరేష్ కుమార్ కృషి చేయాలని జాతీయ ఛైర్మన్ ఆకాంక్షించారు. సంస్థ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ కామారెడ్డి నియోజకవర్గంలో(Kamareddy Constituency) కమిటీని బలోపేతం చేయాలని సూచించారు.
జాతీయ ఛైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్తో పాటు నాయకులు సూర శ్రావంతి, మల్లం వెంకటేశం, కె. సాయిరాం మార్గదర్శకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న హక్కులపై అవగాహన కల్పించాలని కమిటీ నాయకులు సూచించారు.తనకు కీలక బాధ్యతలు అప్పగించిన జాతీయ నాయకత్వానికి బొడ్డు నరేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సమాచార హక్కు చట్టం లక్ష్యాల సాధనకు, బాధితులకు అండగా నిలిచేందుకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.