బతుకమ్మ సంబరాలకు చెరువు కట్ట ముస్తాబు
చెరువు మెట్ల వద్ద గుర్రపు డెక్కను తొలగించిన సర్పంచ్ పద్మ జగన్నాధం
పాపన్నపేట,అక్టోబర్10: బతుకమ్మ పండుగ వేళ గ్రామ చెరువు(Village tank) పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా కొత్తపల్లి గ్రామ పంచాయతీ(Kothapalli Gram Panchayat) చర్యలు చేపట్టింది. చెరువు కట్ట వద్ద ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు, బతుకమ్మ మెట్ల వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్కను(Water hyacinth) తొలగించే పనులను ఆదివారం చేపట్టారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెరువు పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సర్పంచ్ పద్మ జగన్నాధం పారిశుధ్య పనులు నిర్వహిస్తూ, పండుగకు అనువైన వాతావరణం కల్పించెందుకు చర్యలు చేపట్టారు. గ్రామ పరిసరాల పరిశుభ్రతతో పాటు పండుగ వేళ ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ ముందుకు సాగుతోంది. బతుకమ్మ వేడుకలు సంతోషకరమైన వాతావరణంలో జరుపుకునేలా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నట్లు ఆమె తెలిపారు.