శ్రీరామ కోలాట బృందానికి ఏకరూప చీరల పంపిణీ

10-10-2026 | 07:22pm

ఆళ్లపల్లి: అక్టోబర్ 10, (విజయక్రాంతి) : శ్రీరామ కోలాట బృంద(Sri Rama Kolata Troupe) మహిళలకు రూ.25 వేల విలువైన చీరలను  రేగళ్లకు చెందిన దేవరగట్ల శ్రీనివాసరావు సతీమణి జయమ్మ, దేవరగట్ల ప్రసాద్(Devaragatla Prasad) సతీమణి పద్మశ్రీ, ఖమ్మంకు చెందిన వనపర్తి భాస్కర్ సతీమణి శిరీష సహకారంతో ప్రముఖ వ్యాపారస్తులు అబ్బు నాగేశ్వరరావు సతీమణి జానకమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళలను ప్రోత్సహిస్తూ ఆలయ అభివృద్ధికి అనేకమంది సహాయ సహకారాలు అందించారని, రామాలయంలో కోలాటం నేర్చుకొని వివిధ దైవ కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తున్న ఆళ్లపల్లి కోలాట బృందానికి వివిధ ప్రాంతాల నుంచి సహకారం అందించడం అభినందనీయమన్నారు. వారందరికీ,శ్రీరామ కోలాట బృందం తరుపున  ప్రత్యేకంగాధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామాలయ  ఆలయ కమిటీ, కోలాట బృందం,ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు