బ్రహ్మాజీవాడిలో ఘనంగా యజ్ఞం
18-10-2026 | 04:44pm
తాడ్వాయి,అక్టోబర్,18( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడువాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామంలో దుర్గామాత అమ్మవారి వద్ద ఆదివారం భక్తులు యజ్ఞం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దుర్గామాత భక్తులు,యువకులు, గ్రామ పెద్దలు యజ్ఞంలో పాల్గొని వేదమంత్రాలతో యజ్ఞం నిర్వహించారు. వర్షాలు సకాలంలో కురవాలని, పంటలు కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత భక్తులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.