డిజిటల్ క్రాఫ్ సర్వే విధానాన్ని పర్యవేక్షించిన ఏఈఓ కావ్యశ్రీ

09-09-2026 | 06:41pm

బాన్సువాడ, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర గ్రామం(Someshwara Village)లోనీ పంట పొలాల్లో చేపట్టే డిజిటల్ క్రాప్ సర్వే  విధాన్ని బుధవారం బాన్సువాడ ఏఈఓ కావ్య శ్రీ పర్వేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన పంటల నమోదు వాలంటీర్ రైతులు పండిస్తున్న పంట పొలం లోకి వెళ్లి రైతులు వేసిన పంట వివరాలను, సర్వేనెంబర్ ఇతరత్రా వివరాలను తప్పకుండా నమోదు చేయాలని ఆమె సూచించారు.

నమోదు చేసిన పంట వివరాల ఆధారంగానే ప్రభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని ఆమె తెలిపారు. రైతులందరూ తమ పంట పొలాలకు వచ్చే పంట నమోదు వాలంటీర్ల వద్దకు వెళ్లి తమ పంట పొలాల వద్ద పూర్తి వివరాలను నమోదు చేయించుకుని సహకరించాలని ఆమె రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు