సర్పంచ్‌కు సమాచారం లేకుండా రేషన్ కార్డుల పంపిణీ?
ధర్మారెడ్డిలో కాంగ్రెస్ నాయకుల తీరుపై సర్పంచ్ లక్ష్మీనారాయణ అభ్యంతరం
తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన.. ఎమ్మెల్యే ఆదేశాలున్నాయంటున్నారని ఆరోపణ
ప్రజాప్రతినిధికి కనీస గౌరవం లేదా? మరో పోరాటానికి సిద్ధమంటూ హెచ్చరిక
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామం(Dharma Reddy Village)లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ(Distribution of ration cards) కార్యక్రమం సర్పంచ్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్వహించడంపై వివాదం నెలకొంది. గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రేషన్ కార్డులు పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్కు చెందిన గ్రామ సర్పంచ్ గుల్లపల్లి లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై శనివారం నాగిరెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఎమ్మెల్యే ఆదేశాలున్నాయంటున్నారు.
గత రెండు,మూడు రోజులుగా ధర్మారెడ్డి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్నప్పటికీ గ్రామ సర్పంచ్‌గా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా ‘ఎమ్మెల్యే ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారని, అయితే స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.ప్రజల చేత ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయమా?ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావివ్వకుండా ప్రజాప్రతినిధులందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సర్పంచ్ పేర్కొన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కూడా రాజకీయ జోక్యం ఉందనే అనుమానాలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయని అన్నారు. గతంలో కల్యాణలక్ష్మి,సీఎంఆర్ చెక్కుల పంపిణీ సమయంలో కుండా తాముకు ఎలాంటి జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. మరో పోరాటానికి సిద్ధం సర్పంచ్ లక్ష్మీనారాయణ తెలిపారు. గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన తనకు కనీస సమాచారం, గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కూడా ఇలాంటి కార్యక్రమాలను సర్పంచ్‌కు సమాచారం లేకుండా నిర్వహిస్తే ప్రజల తరఫున మరో దశ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల కోసం నిర్వహించాలి తప్ప రాజకీయ కార్యక్రమాలుగా మార్చకూడదని అన్నారు.