36 ఏళ్లుగా దైవసేవలో శ్రీ వెంకటేశ్వర భజన మండలి
13-09-2026 | 12:40am
చేర్యాల: ఆకునూరు గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భజన మండలి(Sri Venkateswara Bhajan Mandali) గత 36 సంవత్సరాలుగా నిరంతరం దైవ సేవలో భజనలు చేస్తూ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది.గ్రామంలోని రామాలయం, శివాలయం వేదికగా ప్రతి శనివారం, ఏకాదశి, సోమవారం భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రావణమాసం(Sravana Masam) సందర్భంగా గత నెల రోజులుగా ప్రత్యేక భజనలు చేస్తున్నారు. ముగింపు వేడుకగా శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం 12 గంటల అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకునూరుతో పాటు చేర్యాల, బచ్చన్నపేట, నర్సాయపల్లి, గాగిల్లాపూర్, రాంపూర్, మర్మాముల, బైరాన్ పల్లి, జాలపల్లి, కొత్త దొమ్మాట తదితర గ్రామాల భజన మండలులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.