ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే

17-10-2026 | 03:20pm

మాజీ జెడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు

నిజాంసాగర్,(విజయక్రాంతి): ఎల్నినో, ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్(Congress ) తెచ్చిన కరువేనని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు(Former ZP Chairman Dafedar Raju) అన్నారు శనివారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు . కాంగ్రెస్ సర్కారు పాలన వైఫల్యం రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టిందని, విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మండి పడ్డారు. సాగునీరు, కరెంట్ లేక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

అన్నదాతలు అప్పులు చేసి పెట్టు బడి పెట్టి సాగు చేసిన పంటలు కరెంట్ లేక, నీరం దక ఎండిపోవడం కాంగ్రెస్ పాలన వైఫల్యాలకు నిదర్శనమన్నారు.నాడు కేసీఆర్ సర్కారు వ్యవసాయానికి నాణ్య మైన విద్యుత్ అందించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని బలో పేతం చేసిందని గుర్తు చేశారు. నేడు విద్యుత్ సరఫరాలో వైఫల్యానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు పెరుగు తున్నాయని, రైతులకు నిరంతర విద్యుత్ ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. తెలంగా ణకు ఆర్థికంగా కీలకమైన

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం

సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, సంస్థ బలోపేతం కావడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ఎంతో అవసరమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా వ్యవస్థ, వ్యవసాయానికి అందించిన విద్యుత్పై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాకుండా, ప్రస్తుత ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివ రించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తి నప్పుడు అధికారులపై నెపంనెట్టి ప్రభుత్వం తన బాధ్య తల నుంచి తప్పించుకోవడం సరికాదని సూచించారు.

విద్యుత్ కోతలను తక్షణమే నివారించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలోని రైతులు, కార్మికులు, సామాన్య ప్రజ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత ప్రభు త్వంపై నిందలు వేస్తూ కాలయాపన చేయడం మానుకో వాలని హితవు పలికారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ సిడిసి చైర్మన్ గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ నాయకులు, సర్పంచులు లింగాల రామచందర్ సర్పంచ్ శ్రీనివాస్ లక్ష్మీనారాయణ సంగమేశ్వర్ గౌడ్ రాజేశ్వర్ గౌడ్ మనీష్ రెడ్డి గొల్ల రాజు రవి మిడత సాయిలు రాములు మల్లయ్య కిష్టారెడ్డి వెంకటేశం తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు