ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు

02-11-2026 | 03:36pm

తాడ్వాయి,(విజయక్రాంతి): ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారు సంజీవులు(Mandal Congress President Bandaru Sanjeevulu) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి(Nandiwada village ) చెందిన ముక్కు పెద్ద లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఆమె ఇంటి నిర్మాణానికి సోమవారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో ఇప్పటికే చాలా మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు(Indiramma houses) మంజూరయ్యాయని తెలిపారు. వారు ఇండ్లు నిర్మించుకుంటున్నారన్నారు. నిరుపేద ఇందిరమ్మ లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు లకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు.

అనంతరం గ్రామంలో నిర్మితమవుతున్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఇటీవల అనారోగ్యానికి గురైన ఉగ్రవాయి భాస్కర్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య,తాడువాయి, దేమికలాన్ సింగిల్ విండో ల చైర్మన్ లు సంతాజి గారి సుధాకర్ రావు, ఏనుగు వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, నరేష్,మేకల రాజు, శ్యాంరావు, శ్రీకాంత్, బాల సాయిలు, వీడిసి అధ్యక్షులు కంకణాల బాల్ చంద్రం, సంతోష్ రావు, గణపతి, పండరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు