బాన్సువాడలో వ్యక్తి అదృశ్యం...
ఆచూకీ తెలిసినవారు సమాచారం అందించాలి...
బాన్సువాడ పోలీసుల విజ్ఞప్తి...
బాన్సువాడ, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Bansuwada) పట్టణంలోని చైతన్య కాలనీకి చెందిన జొన్నలగడ్డ ఆదాం(32) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు బాన్సువాడ పోలీసులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ ఉదయం ఇంటి నుంచి బైక్పై బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదని పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదాం తన భార్య రేఖతో కలిసి గత ఎనిమిది నెలలుగా బాన్సువాడలో నివసిస్తున్నాడు.
అక్టోబర్ 24న ఉదయం సుమారు 9 గంటలకు తన బైక్ (నంబర్: టీజీ 07 AM 17395)పై ఇంటి నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భార్యకు ఫోన్ చేసి హైదరాబాద్లో పని చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.అదృశ్యమైన వ్యక్తి జొన్నలగడ్డ ఆదాం, వయస్సు 32 సంవత్సరాలు, ఎత్తు సుమారు ఐదు అడుగులు, చామనచాయ. అదృశ్యమైన సమయంలో తెలుపు రంగు గీతల షర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు.ఆదాం ఆచూకీ తెలిసినవారు, ఎక్కడైనా కనిపించినవారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా బాన్సువాడ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వ్యక్తి ఆచూకీ గుర్తించడంలో ప్రజలు సహకరించాలని కోరారు.