హనుమాన్లు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం
28-10-2026 | 11:35am
బాన్సువాడ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ హనుమాన్లు తల్లి గాండ్ల కిష్టవ్వ నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు(Government Agricultural Advisors),బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) వారి కుటుంబాన్ని పరామర్శించారు. హనుమాన్లు కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.