ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహణ
గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యం
ఆలేరు, నవంబర్ 23 (విజయక్రాంతి): ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో(Mandanapalli village) సోమవారం గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గం, రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, గాదపాక మల్లేష్, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మెడికల్ హెల్త్ క్యాంపు (Medical Health Camp)నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిరిమతి రేణుక నరసయ్య, ఉపసర్పంచ్ పద్మశ్రీ శశిరేఖ సుదర్శన్, వార్డు సభ్యులు కడకంచి శ్రీలత కృష్ణ, తమ్ముడి అంజయ్య రాము, కడకంచి సిద్దిరాజు, ఉట్కూరి అంజయ్య, కుర్రి సాయికుమార్, గుండు బాలమణి, పంచాయతీ కార్యదర్శి సర్వర్ నాయక్ పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ గ్రామస్థాయి ఉద్యోగులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులకు వైద్య సేవలు అందించేందుకు హెల్త్ క్యాంపు నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు.