ఘనంగా ప్రపంచ వారసత్వ వారోత్సవాలు

23-11-2026 | 06:05pm

వెంకటాపూర్, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయం(Ramappa Temple)లో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా సోమవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ ఎ. భవానీ ప్రసాద్, సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ అజిత్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. చారిత్రక కట్టడాల పరిరక్షణపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాలంపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో బి. అవినాష్ ప్రథమ, డి. వర్షిత ద్వితీయ, డి. వరుణ్ కుమార్ తృతీయ బహుమతులు సాధించారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పురావస్తు శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు