బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో భజనలు

23-11-2026 | 06:05pm

సీతారాంపల్లి మహిళా భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం..

సిద్దిపేట రూరల్,నవంబర్ 23: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో(Sri Bugga Rajeswara Swamy Temple) ప్రతి సోమవారం నిర్వహిస్తున్న భజన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సీతారాంపల్లికి చెందిన శ్రీ భ్రమరాంబ మహిళా భజన మండలి సభ్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో భజనలు ఆలపించారు. భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అనంతరం ఆలయ అర్చకులు సీతారామశాస్త్రి స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఈఓ శ్రీధర్ రెడ్డి, ఆలయ అర్చకులు సీతారామశాస్త్రి, డైరెక్టర్ మైపాల్ రెడ్డి, వృత్తి కళాకారుల సంఘం సభ్యులు ఆకునూరి నాగరాజు, రెడ్డి లింగం, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు