గుట్ట పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
18-10-2026 | 05:57pm
బైంసా ( విజయక్రాంతి) : భైంసా పట్టణంలోని(Bhainsa town) గుట్ట పోచమ్మ ఆలయాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్(Mudhol MLA Pawar Ramarao Patil) ఆదివారం సందర్శించారు. దసరా ఉత్సవాల(Dussehra celebrations) నేపథ్యంలో గుట్ట పోచమ్మ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే భక్తులకు(devotees) ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అమ్మవారికి పూజలు హారతి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి స్థానిక నాయకులు ఉన్నారు.