ఘనంగా యువ సంవిధాన్ దివస్
రాజ్యాంగ ప్రతి బహూకరించిన మద్ది చంద్రకాంత్ రెడ్డి..
యువతే దేశ భవిష్యత్తు
భిక్కనూర్, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) దక్షిణ ప్రాంగణంలో మై భారత్–కామారెడ్డి జిల్లా శాఖ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్–యువ సంవిధాన్ దివస్ నిర్వహించారు. ముఖ్య అతిథి మద్ది చంద్రకాంత్ రెడ్డి విశ్వవిద్యాలయానికి రాజ్యాంగ ప్రతిని బహూకరించారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు దేశ అభివృద్ధికి పునాదులని అన్నారు.
మై భారత్ జిల్లా యువజన అధికారి రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువల పరిరక్షణ యువత బాధ్యతని తెలిపారు. విద్యార్థులకు రెండు క్రీడా కిట్లు అందజేశారు. యూత్ ఐకాన్ పి.ఎన్. నివేదిత యువత నాయకత్వం, నైపుణ్యాలు పెంచుకొని స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో సునీల్ రాథోడ్, డాక్టర్ ఎస్. నారాయణ గుప్తా, డాక్టర్ బి. సబిత, డాక్టర్ జి. సునీత, డాక్టర్ యాలాద్రి, సరిత పిట్ల, డాక్టర్ టి. ప్రతిజ్ఞ, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ హరిత, డాక్టర్ నాగరాజు, డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సంతోష్ గౌడ్, దిలీప్, డాక్టర్ పోతన్న, డాక్టర్ ఆఫ్రిన్, డాక్టర్ నిరంజన్, బేగం, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ విజయ్, డాక్టర్ సునీల్, కిషన్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.