పేదలకు కొండంత అండగా ‘ఇందిరమ్మ జీవిత బీమా’

25-11-2026 | 08:01pm

సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు

కోదాడ నవంబర్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకం(Indiramma Kutumba Jeevitha Bima) నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని రెడ్లకుంట సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు పేర్కొన్నారు. బుధవారం రెడ్లకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కుటుంబరావు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతో గ్రామంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెల ప్రసాద్ రావు, పంచాయతీ కార్యదర్శి కొల్లు నాగలక్ష్మి, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు