బన్నీ సాహసయాత్ర

26-09-2026 | 09:38pm

యువ ప్రతిభకు ప్రోత్సాహం

అరుదైన విజయం

6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్–2 శిఖరాన్ని అధిరోహించిన విస్లావత్ బన్ని

కామారెడ్డి,(విజయక్రాంతి): యువతలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని యువ పర్వతారోహకుడు, కామారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల(Telangana Tribal Welfare Degree College) విద్యార్థి విస్లావత్ బన్నీ నిరూపించారు. బిబిపేట మండలం(Bibipet Mandal) జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ పాశ్రామికవేత్త, విద్యా ప్రదాత, సమాజ సేవకులు అయినటువంటి  తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ప్రోత్సాహం, సహకారంతో ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందం(Transcend Adventures Team)లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మియార్ లోయలో 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్–2 శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అరుదైన ఘనత సాధించారు.

ఇప్పటికే పలు పర్వత శిఖరాలను అధిరోహించిన విస్లావత్ బన్నీ(Vislavath Bunny), ఈ ప్రతిష్టాత్మక యాత్రలోనూ తన సాహస ప్రతిభను చాటుకున్నారు. క్లిష్టమైన పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేసి యువతలో స్ఫూర్తిని నింపారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారి లక్ష్యాలను సాధించే క్రమంలో అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించాలనే ఉద్దేశంతో సుభాష్ రెడ్డి ఈ యాత్రకు అండగా నిలిచారు.

ఆయన అందించిన ప్రోత్సాహం, సహకారానికి విస్లావత్ బన్నీ సాధించిన ఈ విజయం చక్కటి నిదర్శనంగా నిలిచింది. విస్లావత్ బన్నీ, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందానికి అభినందనలు మౌంట్ తరంగ్–2 శిఖరాన్ని అధిరోహించి ఘనత సాధించిన విస్లావత్ బన్నీకి, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందానికి పలువురు అభినందనలు తెలిపారు. యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్న  తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డికి  అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు