నూతన చింతకుంట అంబేద్కర్ యువజన సంఘం ఎన్నిక

01-10-2026 | 09:39pm

కొత్తపల్లి, అక్టోబర్ 01 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 8 పళ్లకు  సంబంధించిన 16 మంది పెద్దమనుషులు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా మేరుగు శివాజీ,ప్రధాన కార్యదర్శిగా మేరుగు వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా - మేరుగు శశిధర్ , మేరుగు సంపత్ కోశాధికారిగా మేరుగు అరుణ్,జాయింట్ సెక్రెటరీగా మెరుగు శివకుమార్,ప్రచార కార్యదర్శులుగా పొత్తూరి జయేందర్, రేణిగుంట అనిల్, మెరుగు సంపత్,సాంస్కృతిక కార్యదర్శిగా మేరుగు రాజేందర్.

క్రీడా కార్యదర్శిగా రేణుకుంట రోహిత్, గౌరవ అధ్యక్షులుగా మేరుగు నారాయణ ,మేరుగు లక్ష్మీనారాయణ, రేణుకుంట రాజు,ముఖ్య సలహాదారులుగా మేరుగు పరుశురాం , మేరుగు గట్టయ్య, మేరుగు శ్రీనివాస్, మేరుగు బాబు , మేరుగు శంకర్, మెరుగు రవీందర్ ఎలగందుల కనకయ్య పొత్తూరి మల్లేశం లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని గ్రామ నాయకులు పెద్దమనుషులు పూల దండలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన  మేరుగు శివాజీ మాట్లాడుతూ సంఘం బలోపేతం కొరకు అన్ని వేళలా కృషి చేస్తానని నూతన అధ్యక్షునిగా అవకాశం కల్పించిన  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు . ప్రధాన కార్యదర్శి మేరుగు వినోద్ కుమార్ మాట్లాడుతూ సంఘంలో అందరినీ కలుపుకుపోయి అన్ని సమస్యల పరిష్కారానికై పాటుపడతానని అన్నారు.

ఈ కార్యక్రమంలో చింతకుంట మాజీ ఉపసర్పంచ్ పట్టేం లక్ష్మీనారాయణ 14వ డివిజన్ కాంగ్రెస్ ఇన్చార్జి పట్టేం  రాజేష్ , అంబేద్కర్ యువజన సంఘం మాజీ నాయకులు మేరుగు నారాయణ, మేరుగు అంజయ్య గట్టయ్య ,  పొత్తూరి మల్లేశం, పొత్తూరి రాజేందర్ మేరుగు శ్రీనివాస్, గజ్జెల రాజు, రేణిగుంట రాజు, శేఖర్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు