బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎడవెల్లి శశిధర్ రెడ్డి
ముకరంపుర, నవంబర్ 25 (విజయక్రాంతి): భారతీయ జనతా యువ మోర్చా (BJYM) తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్‌కు చెందిన ఎడవెల్లి శశిధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుందే గణేష్ అధికారిక నియామక ఉత్తర్వులు (Appointment Orders) జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ రాష్ట్రంతో పాటు తమ ప్రాంతంలో పార్టీ బలోపేతం, విస్తరణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. యువతను పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించేందుకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో బీజేవైఎం, బీజేపీ (BJP) బలోపేతానికి తనవంతుగా శాయశక్తులా కృషి చేస్తానని శశిధర్ రెడ్డి వెల్లడించారు.