మహాత్మను మరిచారు!
గాంధీ మ్యూజియంలో చరిత్ర సంపదకు చెదలు
కనీసం రంగులు వేయని పురావస్తుశాఖ
కరీంనగర్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి(Gandhi Jayanti)ని ఘనంగా జరుపుకునేందుకు పాలకులు, ప్రజలు సిద్దమవుతున్నారు. అయితే ఇక్కడ గాంధీ జ్ఞాపకాలను సమాధి చేస్తున్నారు. కరీంనగర్(Karimnagar) నడి బొడ్డున ఉన్న మ్యూజియంను పట్టించుకునే నాధుడే కరువైనాడు. గాంధీ జయంతి, వర్ధంతిల రోజున విగ్రహాలకు దండలు వేసి నివాళులర్పించి పనైపోయింది. అనుకునే నేటి తరం నాయకులు కనీసం గాంధీ మ్యూజియం గురించి పట్టించుకోకపోవడం విచారకరం.
ఇరుకైన స్థలంలో ఉన్న మ్యూజియం కోసం నూతన భవనం నిర్మించాలనే ప్రతిపాదనలు నాటి ఉమ్మ డి రాష్ట్రం నుంచి పెండింగ్‌లోనే ఉంది. పురావస్తు సేకరణ ద్వారా, దాతలు అందించడం ద్వారా నేటి వరకు తరలి పోకుండా ఇంకా 1330 వస్తువులు మ్యూజియంలో ఉన్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా భవనం ముందు ఉన్న ప్రహారిని తొలగించడంతో ముందు వరుసలో ఉన్న విగ్రహాలను, స్థూపాలను వెనకకు మార్చారు. భవనంలో ఒక హాలు మాత్రమే సందర్శనకు వీలుగా ఉంది. మరోహా లు ఉన్నా గుట్టలుగా పేర్చడంతో అందులో ఉన్న పురావస్తు సంపదనను తిలకించే వీలులేకుండా పోతుంది.
ఈ భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించి మ్యూజియంను అభివృద్ధి చేయడానికి 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఐదుకోట్ల రూపాయలతో ప్రతిపాదనలను పురావస్తుశాఖ ప్రభుత్వం ముందు ఉంచింది. మల్టీఫర్పస్ పురాతన పాఠశాలను హేరిటీజ్ సెంటర్‌గా మార్చారు. ప్రభుత్వం హెరిటేజ్ సెంటర్లో గాంధీ మ్యూజియంను తరలిస్తే సందర్శించే వారి సంఖ్య పెరగడంతోపాటు చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ సిటీజన్లు అశపడ్డారుకాని ఈ నిర్ణయాన్ని గాలికి వదిలేశారు.
శతవార్షికం జ్ఞాపకం ఈ మ్యూజియం..జాతిపిత మహాత్మాగాంధీ శతవార్షికం సందర్భంగా 1969లో కరీంనగర్ నడిబొడ్డున, బస్టాండు ఎదురుగా గాంధీశతవా ర్షిక పురవస్తు ప్రదర్శన శాఖలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనశాల కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక చరిత్ర సంపద భాండాగారంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదర్శన శాలలో దాదాపు 2500 సంవత్సరాల నాటి సిలాసికలు, పూర్వ, మధ్య, కత్త రాతి యుగాలకు చెందిన పనిముట్లు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 200 సంవత్సరం నుంచి క్రీస్తుశకంకు చెందిన వివిధ ప్రాతాలలో ఉపయోగించబడ్డ మట్టిపూసలు, మట్టి బొమ్మలు వాటి తయారికి ఉపయోగించిన మూసలు, ఇనుప పనిముట్లు మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.
క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన బీదర్ వస్తువులు, 16వ శతాబ్దంకు చెందిన పింగాణి పనిముట్లు, పూత పాత్రలు, చైనా పేట్లు ఉన్నాయి. క్రీస్తుశకం 17, 18శతాబ్దముకు చెందిన రాజులు వాడిన ఆయుదాలు, శిలాశాసనాలు, శిలావిగ్రహాలు, దక్కను స్కూలుకు చెందిన మీనియేచర్ పేయింటింగ్స్, నవీన చిత్రాలు ఉన్నాయి. 20వ శతాబ్దము వరకు చెందిన ఆయా రాజ వంశాల నాణాలు, లోహపు పాత్రలు, లోహ విగ్రహాలు, రాగి శాసనములు, పురాతన వస్తవులు, కళంకారి అద్దకము లుమ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.
ఇవేకాకుండా జిల్లాలోని ముఖ్యమైన పుర వస్తుశాఖవారి ఆధీనంలో ఉన్న కట్టడాల ఫొటోలు, పురావస్తు వస్తువులు, కట్టడాలను తెలిపే చిత్రాలను ఈ మ్యూజియంలో ఉచిత దర్శనార్థము ప్రదర్శించబడుతున్నాయి.బిగాంధీ మ్యూజియంలో పురావస్తు సంపదకు రక్షణ కరువైంది. స్థలం లేక చెత్తకుప్పల్లో, ఇరుకు గదిలో దేవతా మూర్తుల విగ్రహాలను, పురాతన చిహ్నా లను పడవేశారు. మ్యూజియం ఎడమ వైపు ఉన్నహాలులో తప్ప ఎక్కడా భద్రం గా పురావస్తు సంపద లేదు. రికార్డులోని 81-1,81-2 లో భద్రపరిచిన బంగారు నాణాలు 1990 ప్రాంతంలో దొంగతనానికి గురైనాయి.
మొత్తం 52 గ్రాముల బంగారు నాణాలను (శాతవాహనుల కాలం నాటి నాణాలు) దొంగలు ఎత్తుకెల్లారు. ఇద్దరు ఉద్యోగులపై మాత్రం చర్య తీసుకున్న అధికారులు ఆ తరువాత హైదరాబాద్ మ్యూజియంకు తరలించారు. మ్యూజియం ఎడమవైపు గదిలో గుట్టలుగా విగ్రహాలను, పురాతన కట్టడాల పనిముట్లను పడవేశారు.
ఇక్కడి నుంచి అమరావతికి తరలించిన బౌద్ధస్తూపంలో ముఖ్యమైన ఒక స్థూపంను ఈ మ్యూజియంలో ఉంచినా వెట్టికి వదిలి వేయడంతో విరిగిపోయింది. ధూలికట్ట, కోటిలింగాల ప్రాంతాల తవ్వకాల్లో దొరికిన చరిత్ర సంపదను ప్రదర్శన కోసం మ్యూజియం బయట ఫిల్లర్లను ఏర్పాటు చేశారు. మ్యూజియం స్థలం చిన్నదిగా ఉండటంతో ఈ పరిస్థితి ఉంది. పురావస్తు సంపద వివరాలను పొందపరిచి భావితరాలకు తెలిపే విధంగా మ్యూజియంను ఆధునికరించాలని చరిత్రకారులు కోరుతున్నారు.